నేటి బిజీ లైఫ్‌లో చక్కగా వండుకుని, కడుపు నిండా తినేవాళ్లు బొత్తగా కరువయ్యారంటే అతిశయోక్తి కాదు. తిండి తినడానికి కూడా సమయం లేదని ఎక్కువగా బేకరీ ఫుడ్‌పై ఆధారపడుతున్నారు. అనేక చోట్ల ఉద్యోగాలు చేసే వారు ఇలా బేకరీ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడుతున్నారు. ఈ కారణం చేతనే మన దేశంలో బేకరీ ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. ముఖ్యంగా బేకరీ ఫుడ్‌లలో పఫ్‌లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. పైగా వాసన కూడా ముక్కుపుటాలను యమ ఘాటుగా తగులుతుంది. దీంతో ఎక్కడున్న సారే వెంటనే బేకరీలో వాలి పోయి వీటిని రుచి చూస్తుంటారు భోజన ప్రియులు.