కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎర్ర కండువాపై పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది. జన సైనికులు పోలింగ్ కేంద్రాల్లో ఎర్ర కండువని వేసుకోవడంపై వంగ గీత ఫైర్ అయ్యారు. దీనిపై జనసేన నాయకుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాకినాడ ఎంపీ ప్రస్తుత పిఠాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత ఎన్నికల బూత్‌లోకి జనసేన ఏజెంట్లు ఎర్రకండువా వేసుకు రావడంపై ఫైర్ అయ్యారు.