కొనసాగుతోన్న బోట్ల తొలగింపు ప్రక్రియ నేడు మూడో బోటు తొలగింపు యత్నం

ప్రకాశం బ్యారేజ్‌లో ఆపరేషన్ బోటు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు బోట్లను బయటకు తీసిన ఇంజనీర్లు, అధికారులు.. మిగతా రెండు బోట్ల కోసం ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఈనెల 1వ తేదీన భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ గేట్లవద్దే చిక్కుకున్నాయి.