'ICICI బ్యాంక్ కుంభకోణంలో ఉన్నతాధికారుల హస్తం ఉంది..' మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో కలకలం

ఐసిఐసిఐ బ్యాంక్ మోసంపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఖాతాదారులను పిలిచి జరిగిన మోసం వివరాలను తెలుసుకొని సిఐడి అధికారులు రికార్డులను పరిలీస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పటి బ్యాంక్ మేనేజర్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడీయోలో తాను మోసపోయానంటూ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ చెప్పాడు. చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ ఐసీఐసీఐ శాఖల్లో జరిగిన లావాదేవీలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.