లంచాలు తీసుకునే అవినీతి అధికారులను బిచ్చగాళ్ళతో పోల్చుతూ హనుమకొండలో వినూత్న ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బెగ్గర్స్ అందర్నీ ఒక్కచోటికి చేర్చి వారితో అవినీతి అధికారులకు కనువిప్పు కలిగేలా వినూత్న ప్రదర్శన చేపట్టారు. జ్వాలా స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యం లో చేపట్టిన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసింది.