కోనసీమలో కలకత్తా కూలీలు.. జై శ్రీరామ్ పాటలు పాడుతూ పంట పొలాల్లో పనులు

కోనసీమలో కలకత్తా కూలీలు.. జై శ్రీరామ్ పాటలు పాడుతూ పంట పొలాల్లో పనులు అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులకు కూలీలా కొరత ఏర్పడటంతో కలకత్తా, బెంగాల్ , ఒరిస్సా రాష్ట్రాల నుండి కూలీలను దిగుమతి చేసుకుంటున్నరు రైతులు.పి.గన్నవరం మండలం ముంగండ లో వరి ఉడ్ఫులు ఊడ్చేదుకు వెస్ట్ బెంగాల్ నుండి కూలీలను తీసుకుని తెచ్చుకున్నారు రైతులు. స్థానికంగా కూలీలు లేకపోవడంతో ఒక ఏజెంట్ ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచుకున్నారు రైతులు. అయితే కలకత్తా నుండి వచ్చిన కూలీలు ఒకే కలర్ డ్రెస్ ధరించి జై శ్రీరామ్ అంటూ రాముడు పాటలు పాడుతూ వరి పొలంలో పనులు చేస్తున్నరు కూలీలు. కూలీలా యూనిఫామ్ అలాగే శ్రీరాముడి పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంటున్నాయి.ఒకప్పుడు కోనసీమలో వరి పొలంలో పనులు చేసే కూలీలు జనపథం పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా పనులు చేసేవారు.