అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. రెండో రోజు పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. న్యూయార్క్‌లో 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాకుండా.. వ్యాపార, టెక్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కూడా పాల్గొన్నారు.