లష్కర్‌ బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

రేపటి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో రేపు సికింద్రాబాద్ మారుమోగనుంది.