మానవులకు మంచి స్నేహితుడిగా చెప్పుకొనే పెంపుడు జంతువు కుక్క. నమ్మిన వారి పట్ల నిబద్ధతతో ఉంటుంది కుక్క. విశ్వాసానికి మారుపేరు కుక్క. ఒక్కసారి కడుపు నింపితే చాలు మన వెంటే జీవితాంతం ఉంటాయి. అందుకే కుక్కను మనిషికి మంచి స్నేహితుడిగా చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని హసన్ నుండి కుక్కల విశ్వాసానికి సంబంధించిన ఇలాంటి కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ రెండు కుక్కలు తమ ధైర్యంతో తమ యజమాని పిల్లలను ప్రమాదకరమైన పాము నుండి కాపాడాయి.