యావత్ సమాజాన్ని చలింపజేసే విద్యార్థి లేఖ.. సెలవులు వద్దంటూ సందేశం..

సెలవులు అంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. సెలవులు వస్తున్నాయంటే పిల్లల సంతోషానికి అవధులు ఉండవు. ఆలాంటి సెలవులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటారు. మరికొద్ది రోజుల్లో హాఫ్‌ డే స్కూల్స్‌ సెలవులు వస్తున్నాయని విద్యార్థులు సంబరపడుతున్నారు. కానీ ఓ విద్యార్థి మాత్రం సెలవులు అంటే బాధపడుతున్నాడు. ఎందుకు ఆ విద్యార్థి వేసవి సెలవులు వద్దంటున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని హాఫ్‌ డే స్కూల్స్‌ షెడ్యూల్‎ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.