బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ ఇష్యూ..

ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. బర్త్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే.. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు రెవెన్యూ అధికారులు. ఈసంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది..కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి మాధవి అనే బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం పంచాయతీలో దరఖాస్తు చేసుకుంది. అక్కడ రికార్డులో లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసింది. ఆగస్టు 4వ తేదీన బర్త్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి మధవి అనే బాలిక తల్లి మమతతో కలిసి వెళ్లింది. సర్టిఫికేట్ వచ్చింది అంటూ తహసీల్దార్ కార్యాలయం ముద్ర వేసి ఇచ్చారు. బాలిక తల్లి సర్టిఫికెట్‌ను పరిశీలించడంతో బర్త్ సర్టిఫికెట్ కు బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు గమనించింది.