తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే కాదు.. నాటి రాజుల నుంచి నేటి పాలకులు వరకూ దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకుంటారు. వేంకటాచలపతికి ఎంత పేరుందో.. అంతే పేరు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి ఉంది. అయితే ఇప్పుడు స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం నెలకొంది. లడ్డు తయారీ నాణ్యత రాజకీయ రంగుని పులుముకుంది. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులుగా గతంలో పనిచేసిన రమణదీక్షితులు స్పందించారు.