సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరాతో మహా కుంభమేళాలో పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్.. సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. వీరితో పాటు టాలీవుడ్ దర్శకుడు పవన్‌ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా పవన్‌తో పాటు కుటుంబ సభ్యులకు స్థానిక పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.