రోడ్లపై పక్కన పొదల్లో దాక్కొని.. అటుగా వెళ్లే జనాలపై దాడులకు పాల్పడుతూ అందినకాడికి బంగారం, డబ్బు దోచుకుంటూ.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓ దోపిడి ముఠాకు నంద్యాల పోలీసులు చెక్‌పెట్టారు. ఎనిమిదేళ్లుగా చిక్కకుకుండా తిరుగుతున్న ఈ ముఠాను పాణ్యం పిన్నాపురం కొండల్లో నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురి ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.