రామయ్య జీవితంలో ముఖ్య ఘట్టాల సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ పట్టు చీర సొంతం..

పట్టు వస్త్రంపై రామకోటి నామాలను మగ్గంపై నేసి... తన భక్తిని చాటుకున్నాడు. దాదాపు నాలుగు నెలల పాటు నేసిన పట్టు వస్త్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రామాయణంలోని ముఖ్యమైన 400 ఘట్టాలను పట్టు వస్త్రానికి రెండు వైపులా పట్టుతో నేచి రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 160 అడుగుల పొడవున్న ఈ పట్టు వస్త్రంలో 13 భాషలలో జైశ్రీరామ్ అని రామకోటి నామాన్ని నేశాడు.