దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్‌ వన్‌.. కాశీ తర్వాత ఇక్కడే..

దేవతా వృక్షాలుగా పిలుచుకునే వృక్షాల్లో కదంబ వృక్షాల కథవేరు.. కాశీ పుణ్యక్షేత్రం తరువాత ఒక్క త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయం ఆవరణలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఎరుపురంగులో ఉండే కదంబ పూలు విశేషంగా భక్తులను ఆకర్షించడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెబుతారు. ఈ వృక్షాలను సాక్షాత్తూ పార్వతీదేవి స్వరూపంగా భావించి మహిళలు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.