వినాయక గుడి వద్ద నుండి ప్రారంభమైన ఆషాడ సారే కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. పెద్ద ఎత్తున గుమికూడిన భక్తులతో అమలాపురం గ్రామ దేవత అయిన శ్రీ సుబ్బాలమ్మవారిని దర్శించుకున్నారు భక్తజనం. ముమ్మిడివరం గేటు మీదగా శ్రీదేవి మార్కెట్లో కొలువైయున్న శ్రీదేవి అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో చలివిడి పానకాలు, మిఠాయిలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని సారె అందచేశారు.