రాత్రంతా నరకయాతన అనుభవించిన గీత కార్మికుడు..!

అతని వృత్తి కల్లు గీత.. నిత్యం కల్లు తీస్తే గానీ పూట గడవదు. రోజులాగే కల్లు గీసేందుకు ఈతచెట్టు ఎక్కాడు. అయితే కొద్దిపాటి వర్షానికి పట్టుతప్పి క్రిందపడిపోయాడు ఓ‌ గీత కార్మికుడు. చిమ్మ చీకట్లలో సాయం అందక, చూసేవారు లేక నిస్సయాకస్థితిలో రాత్రంతా 15 గంటలపాటు ‌నరకయాతన‌ అనుభవించాడు. దట్టమైనా చెట్లపొదలు ఉండడం, ఎవ్వరూ చూడకపోవడంతో రాత్రంతా వనంలోనే ఉండిపోయాడు.