హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని రిబ్బా గ్రామంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. ఒక కల్వర్టు గుండా బస్సు వెళ్ళింది. బస్సు వెళ్లిన కొన్ని సెకన్లలోనే, క్లౌడ్ బరస్ట్ వల్ల పర్వతం నుండి శిథిలాల వరద మెరుపు వేగంతో లోయలోకి దూసుకొచ్చింది. దీంతో కింద ఉన్న కల్వర్టు, రోడ్డు అన్నీ ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు నుంచి బస్సు ప్రయాణికులు కొన్ని సెకన్లు వ్యవధిలో తప్పించుకున్నారు.