మనం, మన పిల్లలకు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటాం. ఎవరికి వారు స్థాయి, ఇష్టాలను బట్టి గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. బంధుమిత్రులందరినీ పిలుచుకుని విందు భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు, ఆవులకు బర్త్ డేలు, సీమంతం వంటి కార్యక్రమాలు చేస్తుండటం పరిపాటిగా మారిపోయింది. అదికూడ గ్రాండ్ లెవల్‌లో జరుపుకుంటున్నారు. ఇలాంటి ఘటననే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.