ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగరంలో ఒక ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. ఒక జంట ఆభరణాల షోరూమ్‌లోకి కస్టమర్స్‌లా వచ్చి.. రూ. 6 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌ను దొంగిలించింది. ఈ దొంగతనం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆభరణాల దుకాణంలో నెక్లెస్‌లను చూసేందుకు ఆ జంట వచ్చింది. అప్పటికే షాప్ మూసివేసే సమయం కావడంతో, దుకాణదారుడు స్టాక్ తనిఖీ చేసుకుంటున్నాడు.