బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద సోమవారం నాడు ఒక బస్సు డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో నియంత్రణ కోల్పోయి, 9 వాహనాలను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. వెంటనే స్పందించిన మరో వ్యక్తి డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.