ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో భారీ ప్రమాదం!

ముంబైలో బోటు ప్రమాదం జరిగింది. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా సమీపంలోని సముద్రంలో ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఈ ఘటనల పలువురు పర్యాటకుల గల్లంతు అయ్యారు. ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, 21 మందిని కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రక్షించింది. నీల్‌కమల్‌ ఫెర్రీ బోట్‌ను స్పీడ్‌ బోట్‌ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పడవలో 66 మంది ప్రయాణికులు ఉన్నట్లు భావిస్తున్నారు. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా నుంచి ఎలిఫెంట్‌ కేవ్స్‌కు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.