వర్షాలు వరదలు సృష్టించిన బీభత్సం నుండి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. రోడ్డు మార్గాలు - రైలు మార్గాల్లో రాకపోకలు కొనసాగుతున్నాయి. దాదాపు మూడు రోజులపాటు స్తంభించిన రైళ్ల రాకపోకలు ట్రాక్ పునరుద్ధరణతో మళ్ళీ కొనసాగుతున్నాయి. వరంగల్ - మహబూబాబాద్ మధ్య చెల్లాచెదురైన రైల్వే ట్రాక్ ను రైల్వే సిబ్బంది మూడు రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి పునరుద్ధరించారు. మొత్తం 15 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ ధ్వంసం అవ్వగా, డే అండ్ నైట్ శ్రమించి మరమ్మతులు పూర్తి చేశారు.