నిర్మల్ జిల్లాలో ASI ఓవరాక్షన్ చేశారు. వృద్ధ రైతును నిర్దాక్షిణ్యంగా గ్రామపంచాయతీ నుంచి బయటకు గెంటేశాడు ఎస్‌ఐ రామచంద్రం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌లో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన రైతుని తహశీల్దార్ చాంబర్ నుంచి తోసేశాడు ఎస్‌ఐ. ఈ ఘటనపై టీవీ9 కథనాలకు స్పందించిన ప్రభుత్వం.. ఎస్‌ఐని సస్పెండ్ చేసింది.