ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రూ. 25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు. కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను సీఎం జగన్ ప్రారంభించారు.