ఆవు పేడతో ఎండ వేడిమికి చెక్ పెట్టొచ్చా..?

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యూష వత్సల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. గో మూత్రాన్ని, గో మలాన్ని సాంప్రదాయక పద్ధతుల్లో హిందూ ధర్మ కార్యక్రమాల్లో వినియోగించడం చూస్తూ ఉంటాం. కానీ గోవు మలం, ఆవు పేడతో ఎండ వేడిమిని తట్టుకోవచ్చా అనే అంశంపై ప్రత్యూష వత్సల, ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకులు తరగతి గది గోడలకు ఆవు పేడను రాసి ప్రయోగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.