ఇవాళ తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగనుంది. గురవరాజుపల్లె, మల్లవరం, ఏర్పేడు మీదుగా యాత్ర కొనసాగనుంది. ఉ.11 గంటలకు చిన్నసింగమలలో.. లారీ, ఆటోడ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి కానున్నారు. సాయంత్రం నాయుడుపేటలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. రాత్రికి నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ బస చేయనున్నారు.