తీరంలో సందర్శకులకు చుక్కలు చూపిన భల్లూకం - TV9

ఎలుగుబంటి ఎదురుపడితే చావు కళ్లముందు కనిపించినట్లే. అందుకే బంటిని చూస్తే ఎవరైనా బెదరాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలో అచ్చంగా అదే జరిగింది. సముద్ర తీరంలో సేద తీరేందుకు వచ్చిన సందర్శకుల కంటపడింది భల్లూకం. జనాన్ని చూడగానే, చంపేస్తాను అనేలా పరిగెత్తుకొచ్చింది. ఎలుగు పరుగు చూసి, అక్కడున్న వారు జంప్‌ అయ్యారు. తృటిలో వారి ప్రాణాలు దక్కాయి.