మొక్కల మధ్య వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే షాక్..

విశాఖలోని శ్రీహరిపురం కొండవాలు ప్రాంతంలో ఓ ఇంటి ఫెన్సింగ్‌కు ఏర్పాటు చేసిన వలలో సుమారు 8 అడుగుల భారీ కొండచిలువ చిక్కుకుంది. మొక్కలకు నీళ్లు పోస్తుండగా వింత శబ్దాలు వినిపించడంతో కుటుంబ సభ్యులు పరిశీలించగా పాము కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన బృందం అక్కడికి చేరుకుని వలను కత్తిరించి కొండచిలువను సురక్షితంగా రెస్క్యూ చేసింది.