నల్లమల అడవిలో కన్నడ భక్తుల పాదయాత్ర కొనసాగుతోంది. ఎండను సైతం లెక్కచేయకుండా శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్నారు కన్నడ భక్తులు. భ్రమరాంబ అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించే కన్నడిగులు చీరసారెలతో ఎండను సైతం లెక్కచేయకుండా తరలివస్తున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే అన్న చందంగా కన్నడ భక్తుల భజనలతో మార్మోగుతుంది శ్రీశైలం.