విశాఖలో క్రికెట్ ఫీవర్ అపుడే స్టార్ట్ అయిపోయింది..భారత్-ఆస్ట్రేలియా మధ్య విశాఖ వేదికగా జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ల విక్రయం పూర్తి కాగా. శుక్రవారం (నవంబర్ 17) నుంచి ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నారు.దీంతో టికెట్ల కోసం కౌంటర్ల వద్ద యువత ఎగబడ్డారు. మహిళలు సైతం టికెట్లకు పోటీపడ్డారు. మధురవాడలోని క్రికెట్ స్టేడియంతో పాటు మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని ఇండోర్ స్టేడియంలో టికెట్లను విక్రయిస్తున్నారు