తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సమ్మర్ లో డిఫరెంట్ వెదర్ ఆకట్టుకుంది. పొగ మంచు కప్పేసిన తిరుమల కొండల్లోని వాతావరణం భక్తులు, ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తిరుమల ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేలా దట్టమైన అటవీ ప్రాంతాన్ని పొగ మంచు దట్టంగా అలుపుకోవడం చూసిన భక్తులకు వింత అనుభూతి కలిగింది. తిరుమల కొండ కు వెళుతున్న భక్తులు పొగ మంచు, మేఘాలతో పై నుంచి పూర్తిగా కనిపించని తిరుపతి నగరం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.