Viral Video: సర్పంచ్‌ కుర్చీనే కబ్జా చేసిన శునకం... చూసేందుకు క్యూ కడుతున్న జనం..!

కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టితే ఎలా ఉంటుందో అనేది పక్కన పెడితే.. ఓ శునకం ఏకంగా ఆ గ్రామ సర్పంచ్‌ కుర్చీనే ఆక్రమించేసింది. అయ్యయ్యో... నువ్వు అక్కడ కూర్చోకూడదు.. దిగమని ఎంతచెప్పినా ఆ శునకం ఇంచ్‌ కూడా కదల్లేదు. సర్పంచ్‌ కుర్చీని వదిలేదే లేదంటున్న ఆ శునకాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆ గ్రామపంచాయితీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది.