తెనాలి రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో దాడులకు పాల్పడుతున్నారు. కిడ్నాప్‌లు చేస్తున్నారు. స్థానికులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుంటూరు ఎస్పీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే నేరుగా తెనాలిలో ప్రత్యక్షమయ్యారు. ఏకంగా రౌడీ షీటర్ల ఇంటి లోపలికే వచ్చేశారు జిల్లా ఎస్పీ. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ సతీష్ కుమార్‌ను చూసిన రౌడీ షీటర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.