నారా లోకేష్‌ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం.. మంత్రి ఏమన్నారంటే..

తెలుగుదేశం కార్యకర్తలకు, తనకు మధ్య పోలీసులు అడ్డువచ్చారంటూ మంత్రి నారా లోకేష్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండటంతో వీరి మధ్యంలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్‌ విజయ్‌కుమార్‌ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్‌ సింగరాయకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావులను దూరంగా ఉండాలంటూ హెచ్చరించారు.