స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలనే నినాదంతో ఎన్టీఆర్ వీరభిమాని, ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ గీసిన చిత్రం అందరినీ అకట్టుకుంటుంది. ఎన్టీఆర్ వర్థంతిని పురష్కరించుకొని కోటేష్ మూడుగంటల పాటు శ్రమించి 'ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి'.. అనే అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రం గీశారు. ఎత్రీ డ్రాయింగ్ సీట్ పై మైక్ పెన్ తో ఎన్టీఆర్ చిత్రం ఎంతో అద్బతంగా గీశారు. ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.