చేతిలో వేణువుతో దర్శనమిచ్చే... మీసాల కృష్ణుడు..! ఒక్కసారి దర్శిస్తే చాలు అన్నీ శుభాలే.. ఎక్కడో కాదండోయ్..

మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో కొలువుదీరిన ఈ మీసాల కృష్ణుడు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. ఆ స్వామి అక్కడ కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. అంతేకాదు.. ఆ గుడి ముందు ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో నీటికి మరో ప్రత్యేక కథే ఉందంటున్నారు గ్రామస్తులు. అందుకే ఈ మీసాల కృష్ణుడిని నిత్య పూజలతో కొలుస్తుంటారు భక్తులు.