విద్యార్థి ప్యాంట్‌ జేబులో పేలిన స్మార్ట్‌ఫోన్‌.. ఒక్కసారిగా మంటలు

అన్నమయ్య జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మిట్స్ కళాశాల విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలి తీవ్రంగా గాయపడ్డాడు. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడోవ సంవత్సరం చదువుతున్నాడు. జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.