అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్‌లో చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ - నెక్, పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేళా నిర్వహించి ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా కార్యక్రమంలో పాల్గొని చికెన్ లెగ్ పీస్ లాగించేశారు. దీంతో ఇక చెప్పేదేముంది.. అధికారుల మాటలు మాట అలా ఉంచితే, ఫ్రీగా వస్తుంది కదా.. జనం ఎగబడ్డారు. 'కొంటేనే బర్డ్ ఫ్లూ.. ఫ్రీగా ఇస్తే భయం లేదు గియం లేదు..' అన్నంతలా ఎగబడి మరీ చికెన్ ఎగ్ స్నాక్స్ లాగిన్ చేశారు. గంటల తరబడి క్యూలైన్‌లో వేచి చూసి మరీ, చికెన్ ఎగ్ స్నాక్స్ సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. అప్పటివరకు పుకారు చేసిన వాళ్లు కూడా.. ఫ్రీ చికెన్ కోసం క్యూ లైన్ లో కనిపించడంతో.. వార్నీ ఇది కదా అసలు సంగతి .. అంటూ నోళ్లు కొరుక్కున్నారు జనం..!