శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. పెనుకొండ తహశీల్దార్ శ్రీదర్ ఇచ్చిన బొకేను మంత్రి సవిత విసిరికొట్టారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. మంత్రి సవిత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి బొకేను విసిరికొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.