పబ్బుల్లో గబ్బు వదిలిస్తున్న పోలీస్..

పబ్బుల్లో గబ్బు వదిలిస్తున్న పోలీస్.. హైదరాబాద్ మహా నగరంలోని పబ్స్ మీద ఫోకస్ పెట్టారు పోలీసులు. ఒకవైపు ఆపరేషన్ దూల్‌పేట్, మరో వైపు పబ్బుల మీద దాడులు చేస్తూ ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాల పై ఉక్కుపాదం మోపుతున్నారు తెలంగాణ పోలీసులు. నిత్యం గంజాయితోపాటు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో రైల్వేస్టేషన్, బస్ స్టాపులు, కాలేజీలు, పబ్స్ అని ఏమాత్రం తేడా లేకుండా ప్రధాన ప్రదేశాలలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు.