MLA క్యాంపు కార్యాలయానికి తాళం..!

MLA క్యాంపు కార్యాలయానికి తాళం..! వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాత్రం నర్సంపేట లోని MLA క్యాంపు కార్యాలయంలో ఇప్పటి వరకు అడుగు పెట్ట లేదు. ఇందులో ఉండడానికి పూర్తి విముఖత చూపారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టక పోవడంతో తాళాలు వేలాడుతున్నాయి. ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఎందుకు తాళం పడింది..? వాస్తు దోషమే కారణమా...? ఆ మాజీ MLA ఓటమికి క్యాంపు కార్యాలయం వాస్తు దోషమే గండమైందా..? తాజా MLA అందులో అడుగు పెట్టక పోవడం వెనుక అసలు సీక్రెట్ ఏంటి..? అన్నదీ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.