గంజాయి విక్రయాలు.. వాడకాలపై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉన్నా .. మీ మాట మీదే.. మా దారి మాదే అంటున్నారు స్మగ్లర్లు.. నిత్యం నిఘా ఉన్నా కొత్తదారుల్లో రవాణా.. అమ్మకాలు.. వాడకం.. జరుగుతూనే ఉన్నాయి.. అలా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న దందాను టెక్నాలజీ సాయంతో నెల్లూరు పోలీసులు చెక్ పెట్టారు. నేరుగా వెళితే పోలీసులపై దాడులకు తెగబడేంతగా తిగించిన ముఠాలు రాష్ట్రంలో చాలా చోట్ల దండాలు చేస్తున్నాయి. తాజాగా బయట పడ్డ గంజాయి డెన్ లాంటివి నెల్లూరులో ఇంకా ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.