వార్డర్‌‌పై దాడి చేసి జైలు నుంచి తప్పించుకున్నారు.. ఇంతలోనే వైజాగ్ రైల్వే స్టేషన్‌లో..

ఆంధ్రప్రదేశ్.. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఇద్దరు ఖైదీలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. విశాఖపట్నం సిటీలోనే ఇద్దరు ఖైదీలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి తిరుపతి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.