కారులో విలువైన వస్తువులు పెడుతున్నారా..? ఈ వీడియో చూస్తే భయపడతారు..!

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 24లోని ఒక కంపెనీ బయట ఆపి ఉంచిన కారు కిటికీని పగలగొట్టి డబ్బుతో నిండిన బ్యాగ్‌ను దొంగిలించాడు. ఈ బ్యాగ్‌లో రూ. 12లక్షల నగదు ఉన్నట్టుగా తెలిసింది. ఈ సంఘటన మొత్తం బయట ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలో రికార్డైంది. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.