మహనీయుడిని కోల్పోయి దిగ్భ్రాంతికి గురవుతోంది భారతావని. అలాంటి గొప్ప వ్యక్తిని తలుచుకుని విభిన్న రీతిలో నివాళ్లులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్.. రతన్ టాటా మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయన జీవత చరిత్ర పై ఓ చిత్రాన్ని గీసి చిత్రనివాళి అర్పించారు. డ్రాయింగ్ సీట్ పై ఎటు వంటి గీతలు లేకుండా తెలుగు, ఇంగ్లీషు అక్షరాలతో అయన జీవిత చరిత్రను మైక్రో పెన్నుతో ఎంతో అద్బతంగా చిత్రకారుడు కోటేష్ వేశారు. దాదాపుగా మూడు గంటలపాటు శ్రమించి రతన్ టాటా సజీవంగా జీవించి ఉండేలా అయన చిత్రాన్ని ఎంతో అద్బతంగా గీశారు.