ఏనుగు నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపట్టాడు

ఏనుగును దగ్గర నుంచి చూసేందుకు యత్నించి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని మైసూరు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా ఏనుగు కనిపించింది. దీంతో కారు దిగి దానిని దగ్గరి నుంచి చూసే సాహసం చేశారు. ఈ క్రమంలో ఏనుగు వారిని వెంబడించింది. ఒకతను పరిగెత్తలేక కింద పడిపోయాడు. అయితే దేవుడి దయతో ఏనుగు అతడికి పట్టించుకోకుండా వెనుదిరగడంతో బతికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.