జాలిలో చిక్కుకుని తల్లడిల్లిన పిల్ల కోతి..!

కోతుల గుంపు మామిడి చెట్టు ఎక్కింది. అందులో ఓ పిల్ల కోతి.. చెట్టుపై ఉన్న జాలిలో చిక్కుకుంది. ఆ జాలి నుంచి బయటపడలేక తల్లడిల్లిపోయింది. ఇది గమనించిన స్థానికులు.. జాలి నుంచి కోతిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. మిగతా కోతులు జనంపై దాడికి యత్నం చేశాయి. చివరికి చెట్టు నుంచి కిందకు దిగిన కోతి పిల్ల.. జాలితోనే చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది.