కేదార్‌నాథ్‌కు వెళ్తున్నహెలికాప్టర్ రోడ్డుపై అత్యవసర ల్యాండింగ్..

ఛార్ ధామ్ యాత్రలో భాగంగా భక్తులు గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదార్‌నాథ్ ధామ్‌కు పయనం అవుతారు. యాత్రలో అతి కష్టమైనా ఈ యాత్రను చేసేందుకు భక్తులు కొందరు కాలినడకని ఆశ్రయిస్తే.. మరికొందరు హెలికాప్టర్ ని ఎంచుకుంటున్నారు. ఇలా ఈ రోజు కేదార్‌నాథ్ కి వెళ్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పైలట్ రోడ్డుపైనే అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.